దారుణంగా తెలంగాణ gdp, మైనస్ 14 శాతం గా నమోదు.

దారుణంగా తగ్గిన తెలంగాణ ఆర్థిక పరిస్థితి. Telangana gdp downfall

0
158

తెలంగాణ gdp మైనస్ 14 శాతంగా నమోదైంది. అధ్వాన్న ఆర్థిక పరిస్థితికి ఆర్థిక మంది మే కారణమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో వివరించారు. తన ఈ మాటలను సమర్థించుకోవడానికి దేశంలోని ఇతర రాష్ట్రాల దిగజారిన ఆర్థిక పరిస్థితులను వివరించారు. ఆర్థిక మాంద్యం కారణంగా దేశ జి.డి.పి ఇప్పటికే ఆరు శాతం కన్నా తక్కువ స్థాయిలో నమోదయింది కాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణంగా లేదు. ఎప్పటిలానే ఆరు ఆరున్నర శాతం నమోదయ్యే భారత దేశ జి.డి.పి ఈసారి ఐదు శాతం నమోదైంది. ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక పరిస్థితులు వాటి జిడిపి లతో పోలిస్తే భారత దేశ జీడీపీ చాలా మెరుగ్గా ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర డిజిపి మాత్రం మైనస్ 14 శాతానికి నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

ఆర్థిక మాంద్యం నిజంగానే తెలంగాణ జిడిపి దెబ్బ తీసిందా?

అసలు నిజానికి మాట్లాడుకుంటే ఆర్థికమాంద్యం ఇప్పుడే ప్రపంచంలో ఇప్పుడే మొదలైంది. 2007, 2008 నాటి ఆర్థికమాంద్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ స్థాయిలో నమోదయింది. ఇంకా ఆర్థిక మాంద్య ప్రభావం దేశాలపై పడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడం ఆందోళన కలిగించే విషయమే. అయితే కేవలం ఆర్థిక మాంద్యాన్ని సక్కగా చూపుతున్నారంటూ కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

నిజంగా ఆర్థికమాంద్యం అంతలా ప్రతికూల పరిస్థితుల్ని తయారుచేసింది అంటే దేశ జి.డి.పి కూడా మైనస్ లోకి వెళ్లి ఉండాలి కానీ దేశ జి.డి.పి మంచి స్థాయిలో నమోదయింది. కాశ్మీర్ ఆర్టికల్ ని తీసేయడం, అస్సాంలో విదేశీ కాందిశీకులు తిప్పి వాళ్లు దేశానికి పంపే ప్రయత్నం చేయడం, అయోధ్యలో రామమందిరం కోర్టు వ్యవహారం క్లైమాక్స్ లోకి రావడం లాంటిరాజకీయ పరిస్థితులలో కూడా దేశ జీడీపీ 5 శాతం పైనే ఉండటం చెప్పుకోదగ్గ విషయం అయితే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు లేని తెలంగాణ టిడిపి మాత్రం మైనస్ 14 శాతంగా నమోదవడం విడ్డూరంగా కనిపిస్తోంది.

కొత్తగా కంపెనీలు రాలేదు కొత్తగా ఉద్యోగాలు రాలేదు అంటే మాత్రం జిపి అదే స్థాయిలో ఉండాలి కానీ మైనస్ 14 శాతంగా నమోదు కావడం అంటే ఉన్నవి కోల్పోవడమే కదా. ఏ శాఖలో ఆదాయం తగ్గిందో ప్రభుత్వం ఇంకా వివరించలేదు. ఒకవేళ వ్యవసాయంలో ఆదాయం తగ్గినట్లయితే అది ఆర్థికమాంద్యంతో సంబంధంలేని లేని వ్యవహారం. కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వ్యవసాయం తగ్గుముఖం పడినట్టు అర్థం. ఆర్థిక మాంద్యం కారణంగా ఇంకా ఏ కంపెనీ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగాలను తీసేయ్ లేదు మరి ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయి అనడానికి ఆర్థికమాంద్యం సాకుగా చూపడం తప్పిదమే.

Central tax లో కేంద్ర ప్రభుత్వం 4.19 శాతం కోత పెట్టింది. చాలా రాష్ట్రాల పరిస్థితి మన కంటే మరింత అధ్వాన్నంగా ఉంది. కర్ణాటక పంజాబ్ హర్యానా రాష్ట్రాలు మైనస్ ఆదాయం అభివృద్ధి రేటు నమోదు చేసుకుంటూ తిరోగమనంలో ప్రయాణిస్తున్నాయి ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుడ్డిలో మెల్లగా ఫర్వాలేదనిపించినా నట్టుగా ఉంది, అంటూ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here