తెరాస ని గెలిపించడానికే హుజూర్ నగర్ బరి లో తీన్ మార్ మల్లన్న

0
247
teenmaar mallanna kcr agent

తెరాస ని గెలిపించడానికే హుజూర్ నగర్ బరి లో తీన్ మార్ మల్లన్న నిల్చున్నట్టు లాజికల్ గా ఆలోచిస్తే అర్ధం అవుతుంది. ఎన్నో స్కాం లు, ఇంకొన్ని కుట్ర లు, అవినీతి భాగోతాలు అంటూ యేవో పేపర్ లు చూపెట్టి నానా హంగామా చేసే తీన్ మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ ఇప్పటివరకు ఆయన ఆరోపణల వల్ల ఒక్క కేసు కూడ ఫైల్ ఎందుకు కాలేదో చెప్పడు . ఇప్పుడు కులం పంచాయతీ ని రాష్ట్రం లో లేపుతూ హుజుర్ నగర్ ఉప ఎన్నికల బరిలో దిగుతున్నాడు. బహుజనులు పొద్దున లెవ్వంగనే తింటారు అంటూ కారు కూతలవాగిన మల్లన్న ఇప్పుడు బహుజనులకు భారీ నష్టం చేసే పని మొదలుపెట్టాడు .

తీన్మార్ మల్లన్న ఉప ఎన్నికలో నిలుచోడానికి ఆయన చెబుతున్న కారణం, బహుజనులు , దళితుల ప్రతినిధి గా ఎవరు ఉప ఎన్నికల్లో నిలబడలేదు అని. కమ్యూనిస్ట్ లు కూడా తెరాస తో కుమ్మక్కు అయ్యారు అందుకే నేను నిల్చుంటున్న అన్నారు. కానీ ఆయన హుజుర్నగర్ ఎన్నికల్లో నిల్చుంటున్న అని అనౌన్స్ చేసింది , బీజేపీ పార్టీ కోట రామ రావు ని నిలబెడుతోంది అని తెలిసిన తర్వాతే కదా !!

mallanna kcr agent

బహుజనులు , దళితులు రాజకీయంగా గెలవడమే తన ధ్యేయం అని చెప్పుకునే నవీన్ కుమార్ గారు , ఈరోజు హుజుర్నగర్ ఉప ఎన్నికలో తెరాస పార్టీ గెలవటానికి అన్ని విధాలా సాహయం చేస్తున్నారు.

సోనియా గాంధీ ప్రభుత్వం పై సుబ్రమణ్య స్వామి ఒకప్పుడు ఇలాగే ఆరోపణలు చేసేవాడు. వాటి అన్నిటి పై కేసు లు నమోదై, టెలికాం స్కాం, హెరాల్డ్ స్కాం అంటూ ఎన్నో అరెస్ట్ లు జరిగాయి.

సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణల వల్ల , కేంద్ర మంతులు జైలు పాలు అయ్యారు, స్వయానా రాహుల్ గాంధీ బెయిల్ పై తిరుగుతున్నారు. మరి ఒక ఏడాది గా ఆరోపణలు చేస్తున్న తీన్ మార్ మల్లన్న వల్ల ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. అటు కెసిఆర్ కానీ తెరాస నాయకులు కానీ , ఈయన ఆరోపణలు అబద్ధం అంటూ ఒక్క పరువు నష్ట దావా కూడా వెయ్యలేదు. WHY SO ??? PLEASE THINK !!!!!

ఈయన గారి ఎన్నికల స్టంట్ వల్ల తెరాస కి లాభం , ఎలాగో చూడండి :

తెరాస ,మరియు కాంగ్రెస్ రెండు కూడా రెడ్డి కులం వారిని నిలబెడుతున్నాయి. అక్కడ రెడ్డి కులం జనాభా దాదాపు 18 శాతం . అందుకు రెండు పార్టీ లు పోటా పోటీగా రెడ్డి నాయకులకి టికెట్ ఇచ్చాయి.

కానీ అక్కడ ఇప్పుడే బలపడుతున్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక బహుజన కులానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. Kotaramarao is a backward caste doctor.

ఇప్పుడు బీసీ ఓట్లు గణనీయంగా ఒక డాక్టర్ అయినటువంటి కోట రామ రావు వైపు పడబోతున్న ఈ తరుణం లో , తెరాస కి దాదాపు 40 % వున్న బీసీ లు చెక్ పెట్ట బోతున్నారు. ఎలాగో బీజేపీ శ్రీలత రెడ్డి కి టికెట్ ఇవ్వట్లేదు, ఒక బీసీ అయినట్టు వంటి కోట రామారావు కి టికెట్ ఇస్తోంది అని తెల్వగానే, తీన్ మార్ మల్లన్న హుజుర్నగర్ లో పోటీ చేస్తున్నా అంటూ అనౌన్స్ చేసాడు.

ఇప్పుడు నష్టం ఎవరికీ , బీసీ వోట్ లు చీలి బహుజనుడు అయినటువంటి కోట రామారావు కె కదా ??

తీన్మార్ మల్లన్న స్థానికుడు కాదు, బలమైన పార్టీ కాదు, గెలిచే అవకాశం లేదు, మరి అలాంటప్పుడు గెలిచే ఛాన్స్ వున్న కోట రామారావు ని ఓడించడానికి …..బీసీ , దళిత వాళ్ళని రెచ్చగొట్టి విడగొట్టి , ఆయనకు నష్టం చేకూర్చడమే కదా ?

తీన్మార్ మల్లన్న ఎలాగో గెలవాడు, కానీ బీసీ వోట్ లు ,schedule caste వోట్ లు కోట రామారావు కి తగ్గిస్తాడు , దానివల్ల తెరాస పార్టీ కి లాభం అయ్యి , మల్లి ఒక రెడ్డి ( శానంపూడి సైది రెడ్డి ) గెలుస్తాడు.

Conclusion : మల్లన్న నిజంగా బహుజనులకు న్యాయం చెయ్యాలి అనుకుంటే ,, గెలిచే ఛాన్స్ వున్న ఒక బహుజనుడికి గెలిచే అవకాశాన్ని కాలరాయ కుండా , ఆయనకీ సహాయం చెయ్యాలి అంతే కానీ ఆయన బలాన్ని విడగొట్టి మల్లన్న చెప్పే అగ్ర వర్ణ తెరాస కి సహాయం చెయ్యడం మూర్ఖత్వం.

Note : usually Movieandpeople team doesnt write much in Telugu unless we want even the rural area public to understand few things. Theenmaar mallanna’s act is foolish as he is only going to split the votes of BC and SCs and thus favor TRS party in return.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here