జ్యోతిర్లింగ శివ లింగం నుంచి ఉధృతంగా ఉబికి వస్తున్న నీరు , మునిగిపోయిన త్రయంబకం పట్టణం వీధులు

జ్యోతిర్లింగ శివ లింగం నుంచి ఉధృతంగా ఉబికి వస్తున్న నీరు , మునిగిపోయిన త్రయంబకం పట్టణం వీధులు

0
126
water from shivling in trayambak temple

జ్యోతిర్లింగ క్షేత్రం అయినటువంటి నాశిక్ లోని త్రయంబకం గుడి లోని శివ లింగం నుంచి ఏక ధాటిగా నీరు ఉబికి రావడం అధికారుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలే విపరీత వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అవ్వడం తో కునుకు లేకుండా వున్నా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు నాసిక్ పట్టణం కూడా ప్రమాదబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

త్రయంబకం లోని శివ లింగం నుంచి అప్పుడప్పుడు నీరు రావడం సహజమే కానీ ఇంత ఉధృతంగా నీరు ఉబికి రావడం, చుట్టుపక్క వీధులు, దుకాణ సముదాయాలు అన్ని మునగడం కాస్త విస్తు కొలిచే విషయం. అనాదిగా అక్కడ దుకాణదారులు ఎన్నడూ లేని ఈ వింత కు ఆశ్చర్యాన్ని వెళ్లబుచ్చుతున్నారు. నీరు లింగం పానవట్టం లోంచి పైకి ఉబికి పట్టాన వీధుల్ని ముంచేశాయి.

అయితే త్రయంబక్ పుర ప్రాచీన నివాసులు మరియి ఆలయ పురోహితులు మాత్రం , ఏది వింత ఏమి కాదు అని , సహజంగానే జరిగే ప్రక్రియ అని చెబుతున్నారు. వారి మాటల ప్రకారం, త్రయంబకం పురాణం ఆధారంగా చూస్తే , శివ లింగం కిందుగా అనగా శివుని పాదాల కిందుగా గోదావరి నది పాయ ఒకటి ప్రవహిస్తుంది అని , అందుకే ఎల్లపుడూ నీరు ఉంటుంది అని, కాకపోతే విపీరత వర్షా సమయాల్లో మాత్ర్హం ఇలా జరగవొచ్చు అని చెబుతున్న్నారు.

godavari river starting point కోసం చిత్ర ఫలితం

త్రయంబక్ టెంపుల్ బ్రహ్మగిరి కొండా దిగువన ఉంటుంది, ఆ కొండా పైనే గోదావరి నది జన్మ స్థలం , అక్కడ నుంచే గోదావరి నది తూర్పు దిక్కుగా ఆలయ చుట్టూరా ప్రవహించి కొన్ని వందల కిలోమీటర్ లు ప్రయాణించి తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించి , ఆపై సముద్రం లో కలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here