ABN ఆంధ్రజ్యోతి కి హైదరాబాద్ పోలీస్ స్వీట్ warning .

హద్దు దాటిన ఆంధ్ర జ్యోతి, అయోధ్య బాబ్రీ masjid విషయం లో court నిర్ణయం, ప్రజల అభిప్రాయం వేరు గా చూపే ప్రయత్నం

0
167

ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ కోసం తపించే టీవీ ఛానెల్స్ లో ABN Andhra Jyothi ముందు వరుసలో ఉంటుంది. అడ్డమైన డిబేట్లు, ప్రజలను తప్పుదోవ పట్టించే విశ్లేషణలు, ఏదో ఒక పార్టీకి తగ్గట్టుగా రిపోర్టులను రెడీ చేయడం, ఇవన్నీ మన తెలుగు ఛానల్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఎప్పుడూ తమ ఇష్టారాజ్యంగా మెలగ వొచ్చు అని అనుకున్న మన తెలుగు మీడియా కి ఇప్పుడు వరుసగా దెబ్బలు పడుతున్నాయి. ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో తెలియని మన చానెళ్లపై మన అధికారులు నిరంకుశం గానే ఉండాలేమో. అప్పుడే దారికి వస్తారు అన్నట్లుగా జరిగింది ఈరోజు సంఘటన.

అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు వివాదం పై ఈరోజు కోర్టు జడ్జిమెంట్ రానున్న సంగతి చాలా రోజులకు ముందే దేశమంతా తెలిసిపోయింది. గత వారం రోజులుగా పోలీసులు వివిధ మార్గాల ద్వారా అటు మీడియా నీ ఇటు సంఘ వ్యతిరేక శక్తులను, మతతత్వ సంస్థలను, సామాన్య ప్రజలు సైతం శాంతియుతంగా సంయమనంతో ఉండాలి అంటూ తెలియజేశారు.

మీడియాకు కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు. కొద్దిరోజుల పాటు విద్వేషాలను రెచ్చగొట్టడం లేదా ఆ అంశంపై అతిగా మాట్లాడడం వంటివి సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్లో కానీ జరగకూడదు అంటూ పోలీసులు కాస్త గట్టిగానే ప్రవర్తించారు.

కానీ ఇవేవీ పట్టనట్టు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇ ఎప్పటిలాగే ప్రజలపై ఒక ఫోన్ రిలీజ్ చేసే ప్రయత్నం చేసింది.

అయోధ్య బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ సమర్ధిస్తున్నారా అంటూ ఒక poll ని ట్విట్టర్ లో రిలీజ్ చేసింది.

ఈ విషయాన్ని కొంతమంది నెటిజన్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు ఈ పోల్ ని డిలీట్ చేయవలసిందిగా అయిపోయిన ఆంధ్రజ్యోతికి ఆదేశాలు ఇచ్చారు.

అసలు కోర్టు జడ్జిమెంట్ పై ప్రజల అభిప్రాయాన్ని అడగడం సబబేనా??

ఇలా కోర్టు అభిప్రాయాన్ని , ప్రజల అభిప్రాయం తో విభేదించి చూపించే ప్రయత్నం కాదా ??..

ఇది కంటెంట్ ఆఫ్ కోర్ట్ కిందికి వస్తుందా??

వెంటనే ఆ ఫోన్ ని డిలీట్ చేసిన ఆంధ్రజ్యోతి ఇ మీడియా ఇక తన న్యూస్ కంటెంట్ను ఆర్టీసీ ఉద్యమం వైపు మళ్లించింది.

అయితే పోల్ డిలీట్ చేయమని కోరడం ,అంతటితో ఆగిపోవడం ఏంటి అంటూ కొంతమంది తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. బాధ్యతగా మెలగవలసిన మీడియా కోర్ట్ నిర్ణయాల పై ప్రజల అభిప్రాయం కోసం పోల్ నిర్వహించడం ప్రజల్లో అశాంతిని అసహనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమే అంటూ, ఇలా ముందస్తు హెచ్చరిక జారీ చేసినా కూడా ఇలా ప్రవర్తించినందుకు ఆంధ్రజ్యోతిపై క్రిమినల్ కేసు వేయాలి అంటూ కొన్ని సంస్థలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

అసలు మన తెలుగు మీడియా ఎంత లక్కీ, వాళ్లు చేసిన ఆగడాలను న్యాయంగా చట్టం ప్రకారం పరిగణలోకి తీసుకుంటే ఒక్క మీడియా ఛానల్ జర్నలిస్ట్ కానీ ఒక్క టీవీ యాంకర్ గాని ఒక్క మీడియా ఛానల్ ఉన్నారు గానీ జైలుకు వెళ్లకుండా ఉండగలడా????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here