కేవలం నీరు పాలు పండ్ల రసాలే! PAVAN KALYAN కార్తీక మాస దీక్ష .

0
182

కార్తీక మాస దీక్ష మొదలెట్టాడు మన జన సేనాని పవన్ కళ్యాణ్. సినిమాలు లేక ఖాళీ గా వున్న ఈ పవర్ స్టార్ రాజకీయాలలో కూడా ఏ విషయం పై గట్టిగ పోరాడ లేక పోతుండటంతో వార్తల్లో వుండటానికి నానా తిప్పలు పడుతున్నాడు . ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోతున్నారు అంటూ హడావిడి చేసిన ఈ హీరో , ఇప్పుడు తాను కార్తీకమాస దీక్ష మొదలెట్టాడుట.

ఈ నెల ముగిసే అంత వరకు తాను ఘన పదార్థం ఏది తీసుకొని అని తన మీడియా ఏజెంట ల ద్వారా తెలియజేశాడు.. అంటే, అన్నం ,పప్పు, కూరగాయలు, మటన్, చికెన్ వగైరా ఏమి తినడు అని అర్థం.

కేవలం ద్రవ పదార్థం మాత్రమే, అంటే నీరు, పాలు, పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం అన్నమాట. కార్తీక మాస దీక్ష లో సంసారికులకి ఇలాంటి నియమాలు ఏమి లేవు.

మరి పవన్ కళ్యాణ్ గారు ఏ కొత్తదీక్ష మొదలు పెడుతున్నారో అని జనాలు తల గొక్కుంటున్నారు..

కేవలం ద్రవపదార్థం అనేది , సన్యాసులకు మాత్రమే వర్తిస్తుంది… మరి మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ సినిమా హీరో ఇలా నెలమొత్తం సాత్విక ద్రవపదార్థం పై ఉంటే రేపు రాజకీయ ప్రయాణాలు, సినిమా షూటింగ్ లకు శక్తి నీ కోల్పోవాల్సి వస్తుంది.

ఈనాడు ప్రకారం, పవన్ ఏడు నెలలు ఈ దీక్షలో ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here