March 31 నుంచి ఫంక్షన్ హాల్స్ బంద్; కేసిఆర్ strict order! కాదని కళ్యాణ మండపం బుక్ చేస్తే జైల్ కే.

0
60

మార్చి 31 తేది నుంచి ఫంక్షన్ హాల్స్ బుక్ చెయ్యటం చట్ట రీత్యా నేరం కానుంది. కరోనా వైరస్ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. కొద్ది నిమిషాల క్రితం జరిగిన ప్రెస్స్ మీట్ లో ముఖ్య మంత్రి కేసిఆర్ గారు ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు. మార్చ్ 31 తర్వాత ఏ ఫంక్షన్ హాల్, కళ్యాణ మండపం కూడా బుక్ చేసుకునే వీలు లేదు , ఎవరైన ఈ కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే, యజమాని తో సహా , బుక్ చేసిన వాళ్ళ పై కూడా కేసు వెయ్యడం జరుగుతుంది.

ఇవే కాదు, జన సమూహం అధికంగా వుండే, స్టేడియం లు, స్విమ్మింగ్ పూల్స్, జూ పార్క్, అమ్యూజమెంటు పార్కులు , అనగా మౌంట్ ఒపేరా, wonder laa, jalavihar లాంటివి అన్నీ కూడా తదుపరి ఆదేశo వరకు మూసి ఉంచాల్సిన పరిస్థితి.

మార్చి 31 లోపల జరగబోతున్న వివాహాలు కూడా, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని చాలా తక్కువ మంది , 200 మందికి అతిథులను మించకుండా వివాహాది శుభకార్యాలను జరిపించుకోవాలని ముఖ్యమంత్రి ప్రజలకు విన్నవించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here