సభ లో మా భర్తలను అనుమతించండి: మహిళా కౌన్సిలర్లు.

మంటలో కలిసిన మహిళా అభ్యుదయవాదం.

0
70

అధికారిక సమావేశాల్లో కి తమతో పాటు తమ భర్తలను కూడా అనుమతించాలని మహిళా కౌన్సిలర్లు చేసిన డిమాండ్ సర్వత్రా చర్చనీయాంశమైంది. మహిళా సాధికారిత, మహిళా అభ్యుదయం, పాలన లో మహిళల భాగస్వామ్యం లాంటివి దృష్టిలో పెట్టుకొని మన చట్టసభలు రాజ్యాంగ నిపుణులు, ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో స్త్రీలకు రిజర్వేషన్ కల్పించారు. వీటిని కొందరు స్త్రీలు వాళ్ళ స్వార్థం కోసం అభాసు పాలు చేసిన సంఘటన ఇది.

స్త్రీలకు రిజర్వేషన్ కల్పించిన ఈ చట్టం స్త్రీల వల్లే అబాసుపాలు అయిన సందర్భం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగింది.

వేములవాడ మునిసిపల్ కార్యాలయంలో శనివారం పట్టణ అభివృద్ధి పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో తమ భర్తలను కూడా అనుమతించాలని మహిళా కౌన్సిలర్లు డిమాండ్ చేయడం, దానికి కమిషనర్ గారు అనుమతించకపోవడంతో ఆ మహిళా కౌన్సిలర్లు అంతా సభ నుంచి వాకౌట్ చేశారు.

చేసేది ఏమీ లేక కమిషనర్ గారు అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం అసంతృప్తి తో ఉన్న చైర్ పర్సన్ తో సహా మిగితా మహిళా కౌన్సిలర్లు లోనికి రావలసిందిగా కోరారు. ఈసారి కూడా తమ భర్తలను లోనికి ఆహ్వానిస్తే తాము సభకు వస్తామని భీష్మించుకు కూర్చోవడంతో చేసేది ఏమీ లేక మున్సిపల్ కమిషనర్ గారు కౌన్సిలర్ల భర్తలను కూడా సభకు అనుమతించారు.

ఇలాంటి స్త్రీలను ఎన్నుకున్న ఆ ప్రజలది తప్పా, లేక మహిళా అభ్యుదయం కోసం ఇలాంటి చట్టాలు చేసిన మహనీయుల ఆలోచనలు తప్ప అని ప్రజలు నోరు వెళ్ళబెట్టారు..

ఇంకొందరైతే ఏకంగా రాష్ట్ర ,జాతీయ స్థాయి చట్టసభల్లో కూడా స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి జరుగుతున్న ఉద్యమంపై జోకులు పేల్చారు.

కేవలం మున్సిపల్ కార్యాలయంలోనే స్వతంత్రంగా మాట్లాడలేని స్త్రీలు, పార్లమెంట్లో 33శాతం రిజర్వేషన్ కావాలని పోరాడుతున్న సాటి స్త్రీలు తలదించుకునేలా చేశారు.

దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటి అంటే, చదువు తెలివితేటలు ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా కేవలం రిజర్వేషన్ ఆధారంగా ఒక మనిషికి పదవిని కట్టబెడితే ఆ పదవిని నడిపేది, అనుభవించేది ఆ పదవి వెనుక ఉన్న బలమే కానీ ఆ పదవి లో కూర్చున్న వ్యక్తి కాదు.

పేరుకే ఈ మహిళా కౌన్సిలర్లు ,మహిళా ఎమ్మెల్యేలు , మహిళా ఎంపీలు, వీళ్లను నడిపించేది వీళ్ళ భర్తలే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here