DK Aruna Slams Jaipal reddy, Calls him a Liar.

జై పాల్ రెడ్డి mahabubnagar జిల్లా కాంగ్రెస్ లో నిరంకుశంగా వ్యవహరిస్తారు అంటూ D K అరుణ ఒక టీవీ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

0
291
dk aruna jai pal reddy fight

జై పాల్ రెడ్డి అబద్ధాల కోరు ,సమైక్యవాది గా వున్న జై పాల్ రెడ్డి 2014 కి ముందు సడన్ గ తెలంగాణ వాది గ ముద్ర వేయించుకున్నాడు. ఎలాగో తెలంగాణ వస్తోంది , ఇప్పుడు తెలంగాణ వాది గ ముద్ర వేయించుకోకుంటే ఇక రాజకీయ భవిష్యత్తు లేదు అని గ్రహించే ఆఖరి సమయాల్లో తెలంగాణ వాది గ ముద్ర వేయించుకున్నాడు , అంటూ కాంగ్రెస్ పార్టీ ని వీడిన గద్వాల్ మాస్ లీడర్ D. K . Aruna టీవీ 1 ఇంటర్వ్యూ లో వెల్లడించారు.


గత 4 సంవత్సరాలుగా తనను బలహీన పర్చడానికి జైపాల్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు అంటూ ఒక్కక్కటిగా వివరంచారు. తాను కాంగ్రెస్ ని వీడి బీజేపీ లో చేరటానికి ముఖ్య కారణం , mahabubnagar జిల్లా లో తనను రాజకీయం గా ఒంటరి ని చేసే ప్రయత్నం జై పాల్ రెడ్డి వర్గం చెయ్యడమే అని, కాంగ్రెస్ పార్టీ ని జై పాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం పూర్తిగా నాశనం చేసింది అని , అసలు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది అని , ఆ పార్టీ లో ప్రజాస్వామ్యం అనేది లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ లో చాలా చీలికలు వున్నాయి అంటూ సాగుతోన్న పుకారు ని బలపరిచే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారు.

2018 లో తన అనుచరులకు ఎవ్వరికి టిక్కెట్లు రాకుండా అడ్డుకున్నారు అంటూ జిల్లా కు చెందిన తన తమ్ముడు నియోజకవర్గ టికెట్ ని టీడీపీ కి ఇచ్చేలా జై పాల్ రెడ్డి లెటర్ రాసాడు అంటూ అసలు విషయాన్ని చెప్పారు. అదే విధంగా తమ ఇంకో అనుచరుడైన , నారాయణపేట లో శివకుమార్ రెడ్డి ఉదంతాన్ని వివరించారు. శివకుమార్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోడానికి 6 నెలల పై గ తాతసారం చేశారు అని, ఆఖరికి ఆయనకీ టికెట్ ఇవ్వకపోవడం తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి అక్కడ కేవలం 6000 ఓట్లు మాత్రమే వచ్చాయి అని , అంతటి పరాభవానికి జై పాల్ రెడ్డి బాధ్యత వహించాలి అని ఆమె డిమాండ్ చేసారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here