22 Diwakar Travels బస్సులు సీజ్, మరి Orange travels సంగతేంటి జగన్ ??

22 Diwakar ట్రావెల్స్ బస్సులు సీజ్, మరి రూల్స్ ని అతిక్రమిస్తూ వున్న మిగతా సంస్థలు సంగతేంటి??

0
68

Diwakar travels ki చెందిన 22 బస్సులు సీజ్ చెయ్యబడ్డాయి. చట్టం అతిక్రమించి నడుపుతున్నారు అంటూ జెసి దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థ బస్సులు సీజ్ చెయ్యబడ్డాయి. మరి , orange travels బస్సులు ఎందుకు సీజ్ చెయ్యలేదు అంటూ ప్రజలు ప్రశ్నిచడం మొదలెట్టారు. Diwakar travels rule break చెయ్యటం కొత్త కాదు . కానీ దాదాపు గత 10 సంవత్సరాలలో ఏ travels కంపెనీ కూడా rules ni పాటించలేదు. మరి ప్రత్యేకంగా దివాకర్ ట్రావెల్స్ పైనే చర్య ఎందుకు.

Diwakar Reddy రాయలసీమ లో కీలక నేత. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ లో వున్నారు.రాయలసీమ లో వైఎస్ కుటుంబాన్ని గట్టిగా ఎదుర్కునే వ్యక్తులలో జెసి దివాకర్ రెడ్డి ఒకరు. ఇప్పుడు ఈ విధంగా జగన్ ప్రభుత్వం దివాకర్ రెడీ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా…

Orange travels ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అధిక బస్లు వున్న సంస్థ. ఎన్నో సంస్థల బుస్లు బెంగళూరు , ముంబై నుంచి వచ్చేటప్పుడు హైవే మీద గా కాకుండా ఇతర మార్గాల్లో బస్సును తిప్పుతూ కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ లో దాటుతూ తెలంగాణ ఆంధ్రా లోకి ఎంటర్ అవడం సర్వసాధారణమైన విషయం. ఎంతో మంది ప్రయాణికులు ఆన్లైన్లో తమ అనుభవాలను వివరించారు.

బడా సంస్థలైన అన్నీ కూడా ఈ ఫ్రాడ్ డాక్యుమెంటేషన్ లేదా పరిమితి లేని బస్సులు నడుపుతూ హైవే మీద కాకుండా ఇతర మార్గాల్లో బస్సులు దాటించే ఈ క్రమంలో దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయాన్ని ప్రయాణికులకు నష్టం కలిగిస్తూ వస్తున్నాయి.

ఇక ఆరెంజ్ ట్రావెల్స్ విషయానికి వస్తే ఎన్నో కంప్లైంట్లు, కనీసం ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి 5 నుంచి 6 గంటలు మధ్యలో ఒక్కసారి కూడా బస్సు ఆపే ప్రయత్నం చేయరు. ఇక విజయవాడ విశాఖపట్నం వెళ్లే బస్సులు అయితే, ఒక్కోసారి ఉదాహరణకి విశాఖపట్నం వెళ్లే బస్సు ఉందనుకోండి, అది విజయవాడ దాటిన తర్వాత బస్సులోని దాదాపు సగం మంది దిగిపోతారు. మిగతా సగం మంది తో అది విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు బయలుదేరుతుంది, కొన్ని కొన్ని బస్సులు శ్రీకాకుళం వరకు కూడా వెళ్తాయి.

ఇలా విజయవాడ నుంచి శ్రీకాకుళం మధ్యలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయినటువంటి ఆరంజ్ ట్రావెల్స్ మరికొన్ని సంస్థలు ఇవి ఆర్టిసి బస్సు మాదిరిగా లోకల్ ప్యాసింజర్ లని ఎక్కించుకొని ఎటువంటి టికెట్ లేకుండా ఆ ప్రయాణికులు దగ్గర డబ్బులు వసూలు చేస్తాయి. ఈ తతంగమంతా జరిగేది ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.

ఈ సమయాల్లో కేవలం ఆర్టీసీకి మాత్రమే ఇలా లోకల్ ప్యాసింజర్ ఎక్కించుకొని టికెట్లు ఇచ్చి సర్వీస్ చేయడానికి అనుమతి ఉంది కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఈ విధంగా రోజు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నాయి.

వీటికి సంబంధించిన కంప్లైంట్స్ ఆన్లైన్లో కుప్పలుతెప్పలుగా వున్నాయి. అయినా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేవలం దివాకర్ ట్రావెల్స్ మాత్రమే కనిపిస్తోందా??..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here